'నంగనాచి తుంగబుర్ర'లా వ్యవహరిస్తున్న నిత్యానంద స్వామికి సిఐడి పోలీసులు ఆది, సోమవారాల్లో బడితె పూజ (థర్డ్ డిగ్రీ) చేయనున్నారా? నిత్యానంద పోలీసు కస్టడీ సోమవారం మధ్యాహ్నంతో ముగియనుంది. ఈలోపే ఆయన నుంచి విలువైన సమాచారం రాబట్టాలని బెంగళూరు పోలీసులు ఆతృతగా ఉన్నారు.
నాలుగు రోజులు విచారించి వివరాలు సేకరించాలని సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. అయితే నిత్యానంద శుక్రవారం గాఢంగా నిద్రపోయాడు. ఆయన్ను నిద్రలేపడానికి సీఐడీ అధికారులు విఫలయత్నం చేశారు. శనివారం సీఐడీ విభాగం డిఐజి డాక్టర్ గురుప్రసాద్, సీనియర్ అధికారి యంఎన్ రెడ్డితో సహ నలుగురు అధికారులు నిత్యానందను విచారించడానికి సిద్ధమయ్యారు.
పోలీసులను బురిడీ కొట్టించడానికి ఈ రాసలీలల స్వామీజీ అన్ని రకాల యుక్తులను ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. కొంత సమయం స్వామీ వారు నిద్ర పోవడం, ధ్యానం చేయడం తదితర వాటితో అధికారుల సహనాన్ని పరీక్షించాడు. తరువాత భోజనం చేయకుండా మొండికేశాడు. చివరికి తనకు తన ఆశ్రమం నుంచి భోజనం తెప్పించాలని పట్టుబట్టారు. అధికారులు ఆశ్రమం నుంచి భోజనం తెప్పించినా..తినకుండా అలిగాడని తెలిసింది. అనంతరం తనకు పాలు, బాదం, ముంతమామిడి పప్పు (ఈ మూడూ సెక్స్ కోరికలను పెంచేవే కావడం గమనించాల్సిన విషయం) కావాలని గొంతెమ్మ కోర్కెలు కోరాడని ఒక అధికారి వెల్లడించారు.
సోమవారం వరకు నిత్యానందను విచారించడానికి సీఐడీ అధికారులకు అవకాశం వున్నందున అంతవరకు కాలం వెళ్ళదీసి పోలీసుల నుంచి తప్పించుకోవాలని స్వామీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తమిళనాడు పోలీసులు నిత్యానందను అదుపులోకి తీసుకుంటే బెంగళూరు పోలీసులు విచారించడానికి మరింత సమయం పడుతుంది. స్వామి నోరు విప్పకుండా ఇలాగే ప్రవర్తిస్తే సీఐడీ అధికారులు ఇక వారి పద్ధతులలో విచారిస్తారని ఒక అధికారి అన్నారు
Comments
Post a Comment