Skip to main content
కింగ్‌స్లే ముంతాజ్ ఐశ్వర్యారాయ్
హాలీవుడ్ నటుడు సర్ బెన్ కింగ్‌స్లే "తాజ్‌మహాల్'' సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. మహాత్మాగాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన గాంధీ చిత్రాన్ని గుర్తుచేసుకుంటే బాపూజీ పాత్రను అత్యద్బుతంగా పోషించిన కింగ్‌స్లే మనకు వెంటనే గుర్తుకు వస్తారు. ఆయన తాజాగా "తాజ్'' అనే పేరిట ఓ చిత్రాని ప్లాన్ చేస్తున్నారు. తాజ్‌మహాల్‌ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో షాజహాన్ పాత్రని కింగ్‌స్లే పోషిస్తుండగా, ముంతాజ్ పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తున్నారు. సుమారు 25 నుంచి 30 మిలియన్ల డాలర్స్‌తో "తాజ్'' రూపొందనుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని వచ్చే సంవత్సరం జులైలో ప్రారంభం కానుంది
Comments
Post a Comment