Skip to main content

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేషే యాక్షన్‌


శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేషే యాక్షన్‌
యువ కథానాయకుడు మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న భారీ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై యువ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ "మహేష్‌బాబుతో మొదటిసారి పనిచేస్తున్నాను. యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఫస్ట్‌ హాఫ్‌ ఉత్తర భారతదేశంలో నిర్మించనున్నాం. వినోదం, శృంగారం, యాక్షన్‌ అన్నీ సమపాళ్ళలో వుంటాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో మహేష్‌బాబు ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రం వుంటుంది'' అన్నారు. హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ ''శ్రీను వైట్ల చెప్పిన కథ చాలా బాగుంది. వైవిధ్యమైన మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరించే చిత్రం అవుతుంది'' అన్నారు

Comments