Skip to main content

శ్రీను వైట్ల, మహేష్ బాబు చిత్రం


మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. వారు ప్రస్తుతం శ్రీను వైట్ల, వెంకటేష్ కాంబినేషన్లో నమో వెంకటేశ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక మహేష్ తో తాము తీస్తున్న చిత్రం గురించి ఓ ప్రెస్ నోట్ లో నిర్మాతలు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ..మహేష్ తో ఇది నా మొదటి సినిమా. నా పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తాను. అలాగే ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ జెనర్ లో తీస్తాను. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. నా కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తాను. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందిస్తాను అన్నారు. అలాగే తనకి మరో సారి అవకాశమిచ్చిన నిర్మాతలు అనిల్ సుంకర, రామ్, గోపి లకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.,br />
నిర్మాతలు మాట్లాడుతూ...మేము మహేష్ బాబుకు ధాంక్స్ చెప్పుకుంటున్నాము..ఆయనతో సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు. అలాగే రిచ్ ప్రొడక్షన్ విలువలతో, హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని హామీ ఇస్తున్నాం. త్వరలోనే నమో వెంకటేశ చిత్రం రిలీజై మీ మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాం అన్నారు. ఇక ఈ నిర్మాతలు మనోజ్ హీరోగా బిందాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత నుంచి దర్శకుడుగా మారిన వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ముళ్ళపూడి వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడి డైరక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్ చేసారు. వీరికి ఆపర్టునేట్ ఛానెల్ (ఎ టీవి)కూడా ఉంది. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రెడీ అవుతున్న కిలాడీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


Comments